ఫుడ్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో ఉప్పల్ స్టేడియం లో ఫ్రెండ్లీ ఫుడ్ బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. దానికోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికన్నా ముందే ఈరోజు శనివారం కలకత్తాలో లియోనెల్ మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని స్వయంగా మెస్సీ, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కలిసి వర్చువల్ గా ఓపెన్ చేశారు.
అయితే మెస్సి అభిమానులు ఆయన్ని కలిసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ ని చూసేందుకు అభిమానులు ఆత్రుత పడగా.. ఆయన అక్కడనుంచి త్వరగా వెళ్లిపోయారని అభిమానులు చిందులు తొక్కారు. ఎంతో డబ్బు పెట్టి టికెట్ కొనుక్కుంటే ఆయన పదినిమిషాలు కూడా లేరు అంటూ అభిమానులు రెచ్చిపోయారు. స్టేడియం లో అభిమానుల రచ్చ నడుమ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలోని సీట్లను ధ్వంసం చెయ్యడమే కాకుండా గ్రౌండ్ లోని కుర్చీలను విరగ్గొట్టి, బాటిల్స్ విసురుతూ రచ్చ చేసారు. ఆ అభిమానుల రచ్చ నుంచి మెస్సీ ఇంకా ఆయన టీం స్టేడియం లోని సొరంగం మార్గం ద్వారా బయటికి వెళ్లిపోయారు.