తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగింది. కేసీఆర్ తర్వాత కేటీఆర్, అలాగే మేనల్లుడు హరీష్ రావు, కుమార్తె కవిత ఇలా ఫ్యామిలీ మొత్తం తెలంగాణ ని ఏలింది. అయితే కేటీఆర్ మాదిరి కవిత రాజకీయాల్లో పెత్తనం చెయ్యలేకపోయింది. నిజామాబాద్ లో రైతులు ఆమెను ఓడించడం, ఆతర్వాత లిక్కర్ స్కామ్ తో సతమతమవడం ఇవన్నీ కవిత రాజకీయ జీవితంలో మయానిమచ్చలే.
ఇక జైలులో ఉన్నప్పుడు కవితకి ఎలా జ్ఞానోదయం అయ్యిందో తెలియదు కానీ.. కేసీఆర్ కింద బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అన్న కేటీఆర్ మాదిరి తను చక్రం తిప్పలేను అనుకుందో, లేదంటే మనసు గాయపడిందో తెలియదు కానీ.. కేటీఆర్, హరీష్ రావు ల ఎదుగుదలను తట్టుకోలేని కవిత వారిపై సంచలన ఆరోపణలు చేస్తూ తండ్రి కెసిఆర్ ని దూరం చేసుకోవడమే కాదు పార్టీ నుంచి బయటికి గెంటేసేలా ప్లాన్ చేసుకుంది.
బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చాక తెలంగాణ జాగృతి అంటూ కొత్త పార్టీ వైపు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను, ముఖ్యంగా హరీష్ రావు ని టార్గెట్ చేస్తూ హడావిడి చేస్తుంది. అయితే కవిత పార్టీ నుంచి బయటికి రావడం వెనుక ఆమె సీఎం పదవి ఆశించి చేసింది అనేది తాజాగా బయటికొచ్చింది. ఆమె బీఆర్ఎస్ లో ఉంటే ఎప్పటికి సీఎం అవ్వలేదు, కారణం అన్న కేటీఆర్.
అందుకే బయటికొచ్చి ఇలా హడావిడి చేస్తూ ఎప్పటికైనా సీఎం అవుతాను అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది కవిత. కేసీఆర్ లేకుండా కవిత సీఎం అవ్వగలదా, అసలు ఆమెకు సీఎం అయ్యే అర్హత ఉందా అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. ఆమె సీఎం స్తానం కోసమే పార్టీ నుంచి బయటికి వచ్చింది, అదే అసలు నిజం అంటూ మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు.