లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా తమిళ సినిమాలే చేస్తుంది. మిగతా భాషల్లో ఎంతో సెలక్టివ్ గా ఉంటుంది. ప్రముఖంగా టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన నటించాలంటే? న
యనతార మాత్రమే ఆప్షన్ గా కనిపిస్తుంది. అందుకే చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలతో ఎక్కువగా పని చేయగలిగింది. వాళ్ల ఇమేజ్ ను నయన్ మాత్రమే బ్యాలెన్స్ చేయగలదని భావించి మేకర్స్ ఆమెకే పెద పీట వేస్తారు.
ఇప్పటికే చిరంజీవితో కలిసి కొన్ని సినిమాలు చేసింది. తాజాగా మోగాస్టార్ సరసన మరోసారి `మనశంకరవరప్రసాద్` లో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు గురించి కొన్ని ఆసక్తికన విషయాలు పంచుకుంది. `చిరంజీవి గారు అంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు. సెట్స్ లో ప్రతీ సమస్యను అర్దం చేసుకుంటారు. వెంటనే సలహా ఇస్తారు. నేను డాక్యుమెంటరీ తీస్తున్నానని తెలిసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను అందించారు.
చిరంజీవి గారు ఇంట్లో కూడా అంతే. వారంతా కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో కలిసి నటించే అవకాశం ఎప్పుడొచ్చినా వదులుకోను. ఆన్ సెట్స్ లో ఆయనతో ఉన్న ఏ క్షణాలు మర్చిపోలేను. జీవితానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు చెబుతుంటారు. వాటిని ఎంతో ఆసక్తిగా వింటుంటాను` అని తెలిపింది.
ఇప్పటికే చిరుకు జోడీగా నయన్ `సైరా నరసింహారెడ్డి`లో నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. అనంతరం చిరు హీరోగా నటించిన `గాడ్ ఫాదర్` లో సోదరి పాత్ర పోషించింది. ఈసినిమా కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. మూడవ సారి మనశంకర వరప్రసాద్ లో నటిస్తోంది. మరి ఈసారైనా ఆ ప్లాప్ సెంటిమెంట్ని ఈ ద్వయం బ్రేక్ చేస్తుందేమో చూడాలి.