అవును యంగ్ టైగర్ ఎన్టీఆర్-నీల్ కాంబో న్యూస్ వినిపించి చాలా రోజులే అయ్యింది. మొన్నామధ్యన హీరోగారికి ఇప్పటివరకు తీసిన ఫుటేజ్ నచ్చలేదు, అలాగే ఓ స్టార్ నటుడిని కూడా తప్పించారు, మళ్ళి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు అంటూ ఏవేవో వార్తలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గందరగోళానికి గురి చేసాయి.
ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) కోసం బాగా సన్నిబడి ఆ లుక్ లోను ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేసాడు. తాజాగా ఎన్టీఆర్ పూర్తి ఫిట్ నెస్ తో సూపర్ లీన్ లుక్ తో ప్రశాంత్ తో కలిసి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసాడు. ఈరోజు శనివారం నుంచే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్-నీల్ కాంబో ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు, కన్నడ నటి రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ సరసన ఆడిపాడనుంది. ఇక ఈ చిత్రం వచ్చే నెల అంటే జనవరి 26 రిపబ్లిక్ డే కి రిలీజ్ అవ్వబోదు అనేది ప్రస్తుతం షూటింగ్ అప్ డేట్ బట్టి క్లారిటీ వచ్చేసినట్టే.