బాలీవుడ్ బాక్సాఫీసు ని రణవీర్ సింగ్ ధురంధర్ చెడుగుడు ఆడుకుంటుంది. డిసెంబర్ 5 న కొంత నెగిటివిటీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ధురంధర్ మొదటి రోజు మెల్లగా స్టార్ట్ అయ్యి వారం తిరగకుండానే 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో ధురంధర్ టాక్ చూసిన వారు ఈచిత్రం దూకుడు ను ఆపేదెవరు అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ దురంధర్ ని ఆడియన్స్ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో ఆ చిత్రానికి వస్తున్న కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. అఖండ 2 గనక డిసెంబర్ 5 న రిలీజ్ అయ్యి ఉంటే ధురంధర్ దూకుడులో కొట్టుకుపోయేది. ఇప్పటికి నార్త్ లో అఖండ 2 కు ధురంధర్ పెద్ద అడ్డంకే.
సోషల్ మీడియాలో ప్రముఖులు ధురంధర్ షో చూసి అప్రిషేట్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్ నుంచి ధురంధర్ 2 కోసం డిమాండ్ పెరుగుతుంది. ధురంధర్ 2 మార్చ్ 2026 లో విడుదలకాబోతుంది. కాకపోతే ధురంధర్ ప్లాప్ అవ్వాలని కోరుకున్న వాళ్లకు ఈ సక్సెస్ మాత్రం అస్సలు మింగుడుపడడం లేదు.