నిజమే క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఆమెకు ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేవు. హాయ్ నాన్న తర్వాత టాలీవుడ్ ఆఫర్స్ కోసం చూసిన ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఆతర్వాత ఆమెకు తమిళనాట రెడ్ కార్పెట్ పరిచారు. అక్కడ కోలీవుడ్ క్రేజీ హీరోలు కార్తీ, ప్రదీప్ రంగనాధన్ తో బ్యాక్ టు బ్యాక్ నటించేసింది.
కార్తీ తో నటించిన వా వాతియార్ చిత్రం నిన్న డిసెంబర్ 12 న విడుదలకావాల్సి ఉంది. ఈ చిత్రం కోసం కృతి శెట్టి చేసిన ప్రమోషన్స్ మాములుగా లేవు, ఆ ప్రమోషన్స్ లో వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ కృతి శెట్టి అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంది. కానీ ఇప్పుడు కార్తీ-కృతి శెట్టి ల వా వాతియార్ డుదల లేదు. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల అనుకున్న సమయంలోనే సినిమాని వాయిదా వేసారు.
నిర్మాణ సంస్థ పాత బాకీలు ఇప్పుడు వా వాతియార్ మెడకు చుట్టుకోవడంతో వా వాతియార్ విడుదల కాకూండా కోర్టు స్టే ఇవ్వడంతో లాస్ట్ మినిట్ లో సినిమా వాయిదా పడింది. అదే కాదు ప్రదీప్ రంగనాధన్ తో కృతి శెట్టి నటించిన LIK కూడా ఈనెలలోనే విడుదల కావాల్సి ఉండగా.. అది కూడా పోస్ట్ పోన్ అయినట్లుగా టాక్ వినబడుతుంది.
సో వా వాతియార్ తో గ్రాండ్ గా తమిళనాట డెబ్యూతో సత్తా చాటుదామనుకున్న కృతి శెట్టిని వా వాతియార్ పోస్ట్ పోన్ తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది. అది నిజంగా కృతి శెట్టి బ్యాడ్ లక్ అనే చెప్పాలి.