విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` టైటిల్ తో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందు `వెంకటరమణ`, `బంధుమిత్రల అభినందనలతో` ఇలా కొన్ని టైటిల్స్ ప్రచా రంలోకి వచ్చాయి. `మల్లీశ్వరి` తరహాలో గురూజీ మార్క్ ఎంటర్ టైనర్ గా హైలైట్ అయింది. సినిమా ఇదే పేట్రన్ లో ఉంటుంది. కానీ టైటిల్ మాత్రమే మారింది. మళ్లీ గురూజీ `అ` మొదటి అక్షరం టైటిల్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటి వరకూ త్రివిక్రమ్ `అ` మొదటి అక్షరంతో మొదలైన టైటిల్స్ చిత్రాలన్నీ మంచి విజయం సాధించినవే. `అతడు`, ` అత్తారింటికి దారేది`, `అఆ`, `అరవింద సమేత వీరరాఘవ`, `అల వైకుంఠపురములో` చిత్రాలు ఎలాంటి విజయం సాధిం చాయో తెలిసిందే. వీటి లైనప్ లో ప్లాప్ అయిన చిత్రం `అజ్ఞాతవాసి` ఒక్కటే. అదీ అత్తారింటికి దారేది తర్వాత పవన్ తో తెరకెక్కించిన చిత్రం. `అత్తారింటికి దారేది` తరహాలో బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నారు? కానీ అంచనాలు తప్పాయి.
అయినా టైటిల్ మొదటి అక్షరం `అ` అన్నది గురూజీ ఓ సక్సెస్ సెంటిమెంట్. తాజాగా `ఆ`దర్శకుటుంబం హౌస్ నెంబర్ 47` కూడా అదే కాన్పిడెన్స్ తో పట్టాలె క్కించారు. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు భారీగా ఏర్పాడ్డాయి. కుటుంబ కథా చిత్రాల్లో అద్భుతమైన భావోద్వేగాలతో పాటు, కడుపుబ్బా కామెడీని హైలైట్ చేయడం లో గురూజీ స్పెషలిస్ట్. అందులోనూ వెంకీ లాంటి స్టార్ తో ఈ జానర్లో చిత్రమంటే? హైప్ అంతకంతకు రెట్టింపు అవుతుంది.
వెంకీ నటించిన `మల్లీశ్వరి` సినిమా సక్సెస్ లో గురూజీ కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు త్రివిక్రమ్ డైలాగులు అందించిన సంగతి తెలిసిందే. వెంకీ ఇమేజ్ కు తగ్గ డైలాగులతో అదరగొట్టారు. ఇప్పుడా స్టార్నే గురూజీ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారంటే? అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది చెప్పాల్సిన పనిలేదు.