`కల్కి 2` నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అధిక పారితోషకం..పని గంటల విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో నిర్మాణ సంస్థ తనతో కొనసాగలేమని తీసుకున్న నిర్ణమది. ప్రతీగా దీపిక కూడా తాను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పేసింది. కానీ ప్రభాస్ అనే పాన్ ఇండియా స్టార్ తో గొప్ప అవకాశం కోల్పోయిందన్నది కాదనలేని నిజం. డార్లింగ్ తో నటించడానికి ఎంతో మంది బాలీవుడ్ భామలు క్యూలో ఉన్నారు.
అలాంటి స్టార్ చిత్రాన్నే వదిలేసింది. మరి భవిష్యత్ లో మళ్లీ ప్రభాస్ సినిమాలో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయా? అందుకు దీపిక మనసు అంగీకరిస్తుందా? అన్నది ఇప్పుడే చెప్పలేం. `కల్కి 2` విషయంలో దీపిక వివాదమంతా నిర్మాతలతోనే. హీరోతో ఎలాంటి ఇబ్బంది లేదన్నది వాస్తవం. హీరో గురించి దీపిక కూడా ఇంత వరకూ ఎలాంటి నెగిటివ్ కామెంట్ ఎక్కడా చేయలేదు. తాను డిమాండ్ చేసినంత పారితోషం ఇస్తే దీపిక పాత్రలో కొనసాగేది అన్నది వాస్తవం.
ఎక్కడైనా సమస్య డబ్బుతోనే మొదలవుతుంది? అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. మరి వివాదం తర్వాత ప్రభాస్ గురించి వ్యక్తిగతంగా దీపిక ఎలా భావిస్తుంది? అన్నది ముఖ్యం. అలాగే మరో కొత్త నిర్మాణ సంస్థలో ప్రభాస్ తో కలిసి నటించే మరో ఛాన్స్ వస్తే అంగీకరిస్తుందా? ఈ విషయంలో దీపిక ఎంత పరిణతితో వ్యవహరిస్తుంది? అన్నది ఆసక్తికరమే. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 26వ చిత్రంలో దీపిక హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
`కల్కి 2` నుంచి తప్పుకున్న తర్వాత వెంటనే కమిట్ అయిన మరో ప్రాజెక్ట్ ఇది. మరి ఈ సినిమా కు దీపిక ఎం పారితోషికం తీసుకుంటుందో తెలియాలి. అలాగే బాలీవుడ్ లోనూ షారుక్ ఖాన్ హీరోగా నటిస్తోన్న కింగ్ లోనూ నటిస్తోంది. దీంతో పాటు ఓయంగ్ హీరో ప్రాజెక్ట్ కి కూడా ఒకే చెప్పింది.