పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభంజనం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రభాస్ వెయిట్ విషయంలో మాత్రం డిజప్పాయింట్ తప్పడం లేదు. బాహుబలి తర్వాత ఏ సినిమా చూసినా ప్రభాస్ బరువుగానే కనిపిస్తున్నారు.
అందుకే ప్రభాస్ పబ్లిక్ అప్పీరియన్స్ కూడా తక్కువైపోయింది. అదే అభిమానులు నిరాశ పరిచే విషయం. కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆయన అనుక్షణం థ్రిల్ మోడ్ లోకి తీసుకెలుతున్నారు. స్పిరిట్ కోసం లుక్ మార్చడమే కాదు ఆయన వెయిట్ తగ్గి హ్యాండ్ సమ్ గా మారిపోయారు. జపాన్ వెళ్ళినప్పుడు ఆయన కటౌట్ చూసి అభిమానులు ఎంతగా సంబరపడిపోయారో చెప్పక్కర్లేదు.
తాజాగా ప్రభాస్ స్పెషల్ ఫోటోషూట్ పిక్స్ షేర్ చేసారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంతకన్నా ఏం కావాలి అనేలా ప్రభాస్ లేటెస్ట్ లుక్ కనిపించింది. చేతిలో బొకే తో ప్రభాస్ ని అలా చూస్తే ఫ్యాన్స్ అల్లాడిపోవాల్సిందే. మరి ఇలా బయట ఇంతగా సర్ ప్రైజ్ చేస్తున్న ప్రభాస్ స్పిరిట్ లుక్ తో ఇంకెంత సర్ ప్రైజ్ చేస్తారో చూడాలి.