అందం ఉంది, నటన ఉంది, గ్లామర్ ఉంది కానీ ఎన్ని సినిమాలు చేసినా ఈ అందానికి అదృష్టం కలిసి రావడం లేదు. వరసగా యంగ్ హీరోలు ఛాన్స్ లు ఇచ్చారు, ఒక ఏడాదంతా ఈ హీరోయిన్ దే అన్నారు. కానీ విజయం ఆమడ దూరానే ఆగిపోతుంది. ఆమె ఎవరో ఈపాటికే గెస్ చేసి ఉంటారు. ఆమె బ్యూటిఫుల్ తార భాగ్యశ్రీ బోర్సే.
అందానికి అందం, నటనకు నటన ఉన్నా ఆమెకు సక్సెస్ దక్కడమే లేదు. రవితేజ మిస్టర్ బచ్చన్ లో సాంగ్స్ లో సూపర్ గ్లామర్ షో చేసింది. ఆ సినిమా ప్లాప్. తర్వాత శ్రీలీల వదులుకున్న కింగ్ డమ్ ఆఫర్ పట్టింది, అది కూడా డిజప్పాయింట్ చేసింది. ఇక ఈ ఏడాది నవంబర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
అందులో దుల్కర్ సల్మాన్ కాంత తో భాగ్యశ్రీ బోర్సే మరో నిరాశజనకమైన సినిమాని ఖాతాలో వేసుకుంది. ఇక అదే నెలలో రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా అంది. ఆ చిత్రానికి పాజిటివ్ టాక్ కనిపించినా కలెక్షస్న్ విషయంలో డల్ అయ్యింది. ఆ సినిమా కూడా భాగ్యశ్రీ బోర్సే భారంగానే నిలిచింది.
తాజాగా అమ్మడు సోషల్ మీడియా పిక్స్ చూసి ఇంత అందానికి ఎందుకిన్ని కష్టాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. చీరకట్టులో ఎంత చక్కగా కుందనపు బొమ్మలా ఉంది, మరి భాగ్యశ్రీ బోర్సే చేతిలో ఉన్న ఏకైక సినిమా అఖిల్ లెనిన్ అయినా హిట్ అందిస్తుందో లేదో చూద్దాం.