తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ పార్టీ నుంచి గెంటివేయబడిన ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి ఎంత ఫేమస్ అనేది వేరే చెప్పక్కర్లేదు. వారిరువురు తమ తమ లైఫ్ పార్ట్నర్స్ ని వదిలేసి సహజీవనం చెయ్యడమే కాదు వారిద్దరూ సోషల్ మీడియా రీల్స్ తో ఫేమస్ అయ్యారు. ఇక తాజాగా దివ్వెల మాధురి స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ లో మూడు వారాల పాటు ఉండొచ్చింది.
తాజాగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. నిత్యం వార్తల్లో ఉండే దువ్వాడ-దివ్వెల పోలీస్ ల అదుపులో అనే వార్త సోషల్ మీడియాని షేక్ చేసింది. అయితే దివ్వెల మాధురి బర్త్ డే సందర్భంగా మొయినాబాద్‌లోని ది పెండెంట్ ఫామ్‌హౌస్‌లో దువ్వాడ శ్రీనివాస్ గురువారం రాత్రి పార్టీ నిర్వహించారని తెలుస్తోంది.
ఈ పార్టీకి అనుమతి లేదు అని తెలుస్తుంది. వైసీపీ నేతలతో కలిసి దువ్వాడ-దివ్వెల మాధురి లు ఎంజాయ్ చేసారని, పార్టీలో మద్యంతో పాటు మత్తు పదార్థాలు కూడా ఉన్నాయని సమాచారం. ఈ పార్టీ గురించి స్థానిక పోలీసులకు, ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఫామ్‌హౌస్‌పై దాడి చేసి బర్త్‌డే పార్టీని భగ్నం చేశారు.
అంతేకాదు ఈ బర్త్ డే పార్టీ లో అనుమతి లేని 10 విదేశీ మద్యం బాటిళ్లు, ఏడు హుక్కా పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.