డిసెంబర్ 5 న విడుదలకాబోయే అఖండ తాండవం ప్రీమియర్స్ హడావిడి మొదలైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను అఖండ తాండవం ప్రీమియర్స్ తో అభిమానులు తాండవమాడేస్తున్నారు. బాలకృష్ణ - బోయపాటి లు నాలుగో హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నారు.
మావయ్య బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ సందర్భంగా మేనల్లుడు మినిస్టర్ నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా మావయ్య సినిమా ఆడాలంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
Akhanda2Thaandavam
అఖండ 2 సినిమాలో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. God of Masses మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం. #Akhanda2 అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐదు దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న బాలా మామయ్యకు అభినందనలు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు.. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసారు.