బిగ్ బాస్ సీజన్ 9 లో కన్నడ సీరియల్ నటి తనూజ బిగ్ బాస్ ట్రోఫీ గెలిచేలా ఆమె ఫ్యాన్స్ ఆమెకు ఓట్లు వేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఆకట్టుకున్న తనూజ టాస్క్ ల విషయంలో శక్తి వంచన లేకుండా పోరాడింది. కాకపోతే మూడో వారం నుంచి కళ్యాణ్ తో జత కట్టి ఫ్రెండ్ ఇమ్మాన్యుయేల్ ని దూరం పెట్టడమే కాదు అతను తనకు ఎలాంటి సపోర్ట్ చెయ్యలేదు అని పదే పదే చెప్పింది.
ఇక భరణి ని నాన్న నాన్న అంటూ వెంటపడిన తనూజకి భరణితో ఆ బాండింగ్ దివ్య వల్ల బ్రేక్ అయ్యింది. దివ్య వచ్చాక తనూజ ను భరణి దూరం పెట్టేసాడు. ఆయన బయటికెళ్లి వచ్ఛాక తనూజ తో డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నా తనూజ ప్రతిసారి దివ్య తో గొడవ విషయంలో భరణి లాగింది. ఏదైనా ఆ విషయంలో ఆడియన్స్ లో తనూజపై కాస్త నెగిటివిటి ఉంది.
అదే విషయాన్ని తనూజ ఓట్ అప్పీల్ లో అడిగి మరీ తనూజని బయటి ఆడియన్స్ కడిగేశారు. మీరు ఇమ్మాన్యుయేల్ ఫ్రెండ్ కాదంటూ రెండో వారంలోనే అన్నారు, మళ్లీ ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నారు. భరణి తో మీ బాండ్ బావుంది.. నాన్నా అంటూ తర్వాత భరణి సర్ అన్నారు అంటూ తనూజ తప్పులను ఎత్తి చూపించి మరీ ఆమె తాట తీశారు ఆడియన్స్. దానితో తనూజ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినా ఆమె ఫేస్ మాడిపోయిన ప్రోమో వైరల్ గా మారింది.