సంక్రాంతి కానుకగా `మన శంకర వరప్రసాద్ గారు`,` భర్తమహాశయులకు విజ్ఞప్తి`, `ది రాజాసాబ్`, `అనగనగా ఒకరాజు` లాంటి చిత్రాలు రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. వీటిలో నటిస్తోన్న హీరోల సంగతి పక్కన బెడితే? వాళ్ల సరసన నటిస్తోన్న భామలంతా ప్లాప్ ల్లోనే ఉన్నారు. శంకర ప్రసాద్ లో నటిస్తోన్న నయన తార కు `జవాన్` తర్వాత విజయాలే లేవు. నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో శంకర ప్రసాద్ తో సక్సెస్ అందుకోవాలని ఎదురు చూస్తోంది.
నిధి గర్వాల్ `హరిహర వీరమల్లు`తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఎంతో ప్రయ త్నించింది. కానీ పనవ్వలేదు. దీంతో అమ్మడి ఆశలన్నీ `రాజాసాబ్` పైనే పెట్టుకుంది. ఇదే సినిమాతో మాలీవుడ్ నటి మాళవిక మోహన్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. సక్సెస్ తో తాను సూపర్ భామగా వెలిగిపోవాలనే ఆశతో ఎదురు చూస్తోంది. ఇదే `సంక్రాంతికి వస్తున్నాం`తో మీనాక్షి చౌరది హిట్ అందుకున్నా? క్రెడిట్ అంతా ఐశ్వర్యారాజేష్ ఖాతాలోకి వెళ్లింది.
దీంతో `అనగనగా ఒక రాజు`తో మంచి హిట్ అందుకుని తానేమి తక్కువ కాదని ప్రూవ్ చేయాలని ఎదురు చూస్తోంది.తెలుగు నటి డింపుల్ హయతి మరోసారి రవితేజతో కలిస `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అంతకుముందు రాజా నటించిన సినిమాల్లో భాగమైంది. అవి ప్లాప్ అవ్వడంతో మరోసారి రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఈ సంక్రాంతి అయినా హిట్ తో సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురు చూస్తోంది. గత సినిమా `రామబాణం` కూడా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.
బుట్టబొమ్మ పూజాహెగ్డే బాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి కంబ్యాక్ అయిన తర్వత నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో `జన నాయగన్` తోనైనా సరైన హిట్ అందుకోవాలని ఎదురు చూస్తోంది. విజయ్ హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రమిది. ఈ హిట్ తో టాలీవుడ్ లో కూడా తిరిగి ఛాన్స్ అందుకోవాలన్నది బుట్టబొమ్మ ప్లాన్. మరి సక్సెస్ అవుతుందా? ఫెయిలవుతుందా? అన్నది రిలీజ్ తర్వాత ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఈ సినిమాలన్నీ సంక్రాంతి కానుకగా వివిధ తేదీల్లో రిలీజ్ అవుతున్నాయి.