గత వారం అఖండ 2 ఫైనాన్షియల్ ఇష్యుస్ తో లాస్ట్ మినిట్ లో వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలయ్య చిత్రానికి ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ఆయన అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. అంత పెద్ద హీరో సినిమాకి చివరి నిమిషంలో ఆర్థికపరమైన చిక్కులు రావడం పట్ల పెద్ద చర్చే నడిచింది.
ఇప్పుడు అఖండ 2కి బాలయ్యకొచ్చిన పరిస్థితే సేమ్ తమిళ హీరో కార్తీ అన్నగారు వస్తారు (తెలుగు టైటిల్) కి వచ్చేసింది. అన్నగారు వస్తారు కి కూడా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ వారికి ఫైనాన్సియల్ సమస్యలు ఉన్నాయని ఈ కారణంగా వాయిదా పడొచ్చు అనే రూమర్స్ వచ్చాయి.
ఆ రూమర్స్ నిజమయ్యి అన్నగారు వస్తారు ఇప్పుడు వాయిదా పడింది. ఇక్కడ నిర్మాణ సంస్థ అధికారికంగా అనౌన్స్ చెయ్యకపోయినా.. అన్నగారు వస్తారు వాయిదా పడినట్లుగా యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కన్ ఫర్మ్ చేసింది. తెలుగు సహా తమిళ్ రెండు భాషల్లోని ఈ సినిమా థియేటర్స్ లో రేపు విడుదలకాబోవడం లేదు అని తెలుస్తుంది.