అఖండ 2 మరికాసేపట్లో ప్రీమియర్స్ తో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. ఏపీ, తెలంగాణ లలో అఖండ 2 ప్రీమియర్స్ ఈ రోజు 11 గురువారం రాత్రి 9 గంటల నుంచే మొదలు కానున్నాయి. దానితో నందమూరి అభిమానులంతా అఖండ 2 ప్రీమియర్స్ వేసే థియేటర్స్ దగ్గర బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈలోపు తెలంగాణాలో అఖండ 2 ప్రీమియర్స్ రద్దు, తెలంగాణ హైకోర్టు అఖండ 2 ప్రీమియర్స్ ని అలాగే పెంచిన టికెట్ రేట్ల పై స్టే విధించింది అనే వార్త అభిమానులను అయోమయానికి గురి చేసింది. అఖండ 2 ప్రీమియర్స్ టికెట్ ప్రైస్ 600 గాను, అలాగే అఖండ 2 మాములు టికెట్ ధరలను పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు.
అఖండ- 2 మూవీ సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపు జీవోను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నిర్మాణ సంస్థకు నోటీసులిచ్చింది.
దానితో అఖండ 2 ప్రీమియర్స్ క్యాన్సిల్ అవ్వొచ్చనే టాక్ మొదలైంది. మరోపక్క అఖండ పీఆర్వో అఖండ 2 ప్రీమియర్స్ పై ఈ రూమర్స్ నమ్మొద్దు ఈ రోజు నైట్ 9 గంటలకు అఖండ 2 ప్రీమియర్స్ ఉంటుంది అంటూ చెబుతున్నారు. అఖండ 2 రిలీజ్ అంతా అయ్యోమయ్యంగా ఫాన్స్ సహనానికి పెద్ద పరీక్షాగా మారింది.