ఈమధ్యనే భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబై లోని తన వందలకోట్ల ఇంటి గృహప్రవేశం చేసిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆ గృహప్రవేశంలో భర్త రణబీర్ తో కలిసి గోల్డ్ కలర్ శారీ లో మెరిసింది. కుమార్తె రాహ పుట్టిన తర్వాత పూర్తి ఫిట్ నెస్ తో సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇచ్చిన అలియా భట్ అటు గ్లామర్ విషయంలోనూ తగ్గడం లేదు.
తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ వదిలింది. ఆ పిక్స్ లో అలియా భట్ చాలా క్యూట్ గా అందంగా గ్లామర్ గా కనిపించింది. అలియా భట్ ఆ బ్లాక్ డ్రెస్ లో తెల్లగా మెరిసిపోయింది. సింపుల్ లుక్ అయినా ఆకర్షణగా కనిపించడంతో ఆమె అభిమానులు వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.