బాలీవుడ్ లో కొన్నాళ్లుగా సక్సెస్ లు చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి చెప్పాలి. సౌత్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంటే హిందీ ప్రముఖులు ఆ సక్సెస్ కోసం చాలా వెయిట్ చేసారు. సౌత్ ముందు బాలీవుడ్ బాక్సాఫీసు చాలాసార్లు చిన్నబోయింది. పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ బాక్సాఫీసు పై దండెత్తాయి. దానితో హిందీ పరిశ్రమ హిట్లు కోసం అల్లాడిపోయింది.
ఈ ఏడాది ఛావా బ్లాక్ బస్టర్ హిట్, అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా సెన్సేషన్ క్రియేట్ చేసిన సైయారా లాంటి బిగ్ హిట్స్ మాత్రమే కాదు.. 2025 ఇయర్ ఎండ్ ని బాలీవుడ్ సక్సెస్ లతో ఎండ్ చేస్తున్నారు. రీసెంట్ గా ధనుష్ తేరే ఇష్క్ మే ఎలాంటి అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ చిత్రం 150 కోట్లు కొల్లగొట్టింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతుంది.
ఇక గత వారం విడుదలైన రణవీర్ సింగ్ ధురంధర్ వసూళ్లు రోజుకో రికార్డ్ నెంబర్ నమోదు చేస్తుంది. డిసెంబర్ 5 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 150 కోట్లు దాటేసింది. ధురంధర్ బాలీవుడ్ లో ఈఏడాది బిగ్ హిట్ గా నిలిచే ఛాన్స్ వుంది. మరి ఈ ఏడాది చివరిలో తేరే ఇష్క్ మే, ధురంధర్ హిట్స్ తో హిందీ పరిశ్రమ కళకళలాడుతుంది.
ఆ రెండు సినిమాల విజయాలతో బాలీవుడ్ 2025 కి సక్సెస్ ఫుల్ గా ఎండ్ కార్డు వేసి 2025 బై బై చెప్పెసి 2026 కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పబోతోంది.