బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. రేపు ఆదివారం కాక వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే కి ముహూర్తం పెట్టేసారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో కళ్యాణ్ పడాల టాప్ 5 కి వెళ్లిపోగా మిగతా ఆరుగురు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.
ఓట్ అప్పీల్ కోసం జరిగిన టాస్క్ ల్లో తనూజ vs సంజన, భరణి vs సంజన, సుమన్ శెట్టి ని నమ్మకూడదు అంటూ సంజన ఇలా అబ్బో హౌస్ లో చాలానే గొడవలు జరిగాయి. ఒకొనొక సమయంలో సంజన కి ఇమ్మాన్యుయేల్ కి కూడా గొడవ అయ్యింది. ఈ వారం సంజన జీరో బ్యాలెన్స్ తో జైలు కి కూడా వెళ్ళింది.
చివరి పది రోజుల్లో హౌస్ లో ఉన్న ఆరుగురు ప్రశాంతంగా ఎంజాయ్ చెయ్యకుండా ఇంకా ఇంకా గొడవలు పడుతూనే ఉండడం మాత్రం ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. కానీ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వకుండా టాప్ 5 కి వెళ్లాలి అంటే ఆమాత్రం గొడవ పడాల్సిందే. మరి ఈవారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని అందరూ భావిస్తున్నారు. డబుల్ లేదా సింగిల్ ఎలిమినేషన్ తో సరిపెడతారు అనేది ఆసక్తికరంగా మారింది.