బాలీవుడ్ హీరోయిన్స్ ఇలా పిల్లలను ప్లాన్ చేసుకుని అలా మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చేస్తున్నారు. గతంలో కరీనా కపూర్, అలియా భట్, దీపికా పదుకొనె ఇలా టాప్ హీరోయిన్స్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను ప్లాన్ చేసుకుని.. మళ్లీ ఫిట్ నెస్ తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పుడు కియారా అద్వానీ కూడా ఆ లైన్ లోనే ఉంది.
రీసెంట్ గానే బేబీ కి జన్మనిచ్చిన కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు ఆ పేరెంటింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారి పబ్లిక్ లోకి వచ్చింది కియారా, ఎప్పటిలాగే గ్లామర్ గా పూర్తి ఫిట్ నెస్ తో కియారా అద్వానీ కనిపించింది. తాజాగా కియారా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.
మమస్ నైట్అవుట్ అంటూ కియారా క్యాప్షన్ కూడా పెట్టింది. Mamas night out 🧡అంటూ కియారా సరదాగా పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి ఇక కియారా అద్వానీ షూటింగ్ లో కనిపించేస్తుంది అంటూ ఆమె ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు.