నిన్న మంగళవారం చెన్నై లో జియో ప్లస్ హాట్ స్టార్ సౌత్ ఆన్ బాండ్ ఈవెంట్ లో సౌత్ స్టార్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా జియో హాట్ స్టార్ బిగ్ బాస్ కి హోస్ట్ లు చేస్తున్న కింగ్ నాగార్జున, తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి, మలయాళ హోస్ట్ మోహన్ లాల్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో జియో ప్లస్ హాట్ స్టార్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసింది.
అయితే ఈ ఈవెంట్ లో విజయ్ సేతుపతి నాగార్జున లుక్స్ ని తెగ మెచ్చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన యంగ్ లుక్స్ ని విజయ్ సేతుపతి పొగిడిన విధానానికి అక్కినేని అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. నా చిన్నప్పుడు హీరో నాగార్జున ఎలా ఉన్నారో, ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు. నాగార్జున సర్ కి అసలు వయసు ఎందుకు పెరగడం లేదో నాకు అర్థం కావట్లేదు.
యాంటీ ఏజింగ్ పై పరిశోధనలు చేసేవారు నాగార్జున గారిని తీసుకెళ్లి కొన్ని రోజులు పరీక్షించాలి. అప్పటి నుంచి లుక్స్ అలాగే ఆయన జుట్టు కూడా అలానే ఉంది. ఆయనలో ఎనర్జీ కూడా ఏమాత్రం తగ్గలేదు. నాకు మనవళ్లు పుట్టి వాళ్లు పెద్దవాళ్లు అయినా కూడా నాగార్జున మాత్రం ఇలానే ఉంటారు అంటూ నాగార్జున లుక్స్ పై హీరో విజయ్ సేతుపతి చేసిన సరదా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.