బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నేడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ఉన్న నటి. `క్వాంటికో` సిరీస్ సక్సెస్ హాలీవుడ్ లో ఆమె స్థానాన్నే మార్చేసింది. ఒక్క హిట్ తో ఎక్కడికో రీచ్ అయింది. అక్కడ నుంచి హాలీవుడ్ లో అమ్మడి జర్నీ ఎలా సాగు తుందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. `వారణాసి` చిత్రంతో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా విజయం తో సౌత్ లోనూ ఫేమస్ అయిపోతుంది. బాలీవుడ్ లో ఉన్నంత కాలం కేవలం హిందీ సినిమాలే చేసింది.
సౌత్ లో అవకాశాలు వచ్చినా? అప్పటి పరిస్థితులు కారణంగా చేయలేకపోయింది. తాజాగా పీసీ గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిందంటే? దాని వెనుక ఎంతో కష్టముందో గుర్తు చేసుకుంది. `20 ఏళ్ల వయసులో ఖాళీ లేకుండా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పుడు తన త్యాగానికి అవతలి వైపు చూస్తున్నట్లు ఉందంది. నేనెంతో కష్ట పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఎన్నో పుట్టిన రోజులను మిస్ అయ్యాను. సరదాలు..సంతోషాలు గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
అవంటే ఏంటో పరిశ్రమలో ప్రయత్నాలు మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా మార్చిపోయాను. చివరికి నా తండ్రి ఆసుపత్రిలో ఉంటే ఆయన చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయాను. కుటుంబంతో పండగలు పాల్గొన్నది కూడా చాలా తక్కువగానే. ఆ సమయంలో అంత కష్టపడ్డాను కాబట్టే? నేడు గొప్ప స్థానంలో ఉన్నాను? అని గుర్తొ చ్చిన ప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ కోల్పోయిన ఎన్నో జ్ఞాపకాలు కూడా వెంటాడుతుంటాయి. 20 ఏళ్ల త్యాగమే ఇదంతా ` అని పీసీ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పీసీ కూడా పరిశ్రమకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చింది. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో చిన్నప్పటి నుంచే ఎంతో క్రమశిక్షణతో ఎదిగింది. అయితే హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత భారతీయుల నుంచి చాలా విమర్శలు కూడా ఎదుర్కుంది. హాలీవుడ్ చిత్రాల్లో బోల్డ్ పాత్రలు పోషించడంతో విమర్శలొచ్చాయి. కానీ వాటిని పీసీ పట్టించుకోలేదు.