బిగ్ బాస్ సీజన్ 9 లో రీతూ-డిమోన్ పవన్ ల మధ్యన స్నేహం కాదు వారి మద్యన లవ్ ఉంది అంటూ చాలామంది ఆడియన్స్ తో పాటుగా హౌస్ మేట్స్ అనుకున్నారు. కారణం వాళ్ళిద్దరి షో అలానే ఉండేది. వారి మద్యన ముద్దులు, హగ్గులు, గొడవ అన్ని లవ్ లానే కలిపించేవి. ఇక మరో జంట కళ్యాణ్-తనూజ.
కళ్యాణ్ తనూజ చుట్టూ కంటెంట్ కోసం తిరిగినా తనూజ ఎప్పుడు కళ్యాణ్ కి మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వలేదు. నాకు క్లారిటీ ఉంది, కళ్యాణ్ కి క్లారిటీ ఉంది అంటూ తనూజ ఎప్పుడు క్లారిటీ తోనే చెప్పింది. కళ్యాణ్ తనూజ వెనకపడుతున్నాడని హౌస్లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అలాగే ఇంకా కొంతమంది అన్నారు, తనూజ ను కళ్యాణ్ విషయంలో టార్గెట్ చేసారు. శ్రీజ అయితే తనూజ కళ్యాణ్ విషయంలో ఫేక్, ఆమె జెన్యూన్ కాదు అంది.
అయినప్పటికి కళ్యాణ్-తనూజ పెయిర్ ని ఆడియన్స్ బాగా ఇష్టపడ్డారు. తాజాగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే టాస్క్ లో కళ్యాణ్, సంజన సంచాలక్ లుగా ఇమ్మాన్యుయేల్, పవన్, భరణి, తనూజ, సుమన్ నెట్ లో బాల్స్ వేసే క్రమంలో కళ్యాణ్ ఎక్కువగా తనూజ కి బాల్స్ వెయ్యడంపై తనూజ నాన్న నాన్న అని పిలిచే భరణి తనూజ విషయంలో మాట జారాడు.
కళ్యాణ్ ఏమిటండి తనూజ నించోమంటే నించుంటున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, తనూజ కళ్యాణ్ ని కమాండ్ చేస్తుంది అంటూ సంజనతో మాట్లాడుతున్న ప్రోమో హైలెట్ అయ్యింది.