ఫైనల్లీ అఖండ తాండవం రిలీజ్ సస్పెన్స్ కి తెర దించారు మేకర్స్. డిసెంబర్ 5 న ఆఖరి నిమిషంలో వాయిదా పడిన అఖండ 2 ఆర్ధిక లావాదేవీలు ఓ కొలిక్కి రావడమే కాదు మద్రాస్ హై కోర్టు అఖండ 2 రిలీజ్ కి లైన్ క్లియర్ చెయ్యడంతో ఈ రోజు ఉదయం నుంచే అఖండ తాండవం రిలీజ్ డేట్ పై ఏ క్షణమైనా అధికారిక అనౌన్సమెంట్ వస్తుంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అన్ని రకాల సమస్యలు ముగిసినా అఖండ 2 రిలీజ్ తేదీ ని ప్రకటించేందుకు ఈ రోజు ఉదయం నుంచి వెయిట్ చేయిస్తూ ముహూర్తం పెట్టుకుని ఈ మంగళవారం రాత్రి 10.17 నిమిషాలకు అఖండ 2 అప్ డేట్ అంటూ మేకర్స్ అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తూ అనుకున్న సమయానికి ఆ అప్ డేట్ వదిలి నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఉదయం నుంచి అనుకుంటున్నట్టుగానే డిసెంబర్ 12 న అఖండ 2 రిలీజ్ అంటూ స్పెషల్ గా పవర్ ఫుల్ పోస్టర్ తో అధికారిక ప్రకటన ఇచ్చారు. డిసెంబర్ 11 రాత్రి నుంచే అఖండ 2 తాండవం ప్రీమియర్స్ తో అసలైతే సందడి షురూ అంటూ ప్రకటించడంతో నందమూరి అభిమానులు అలెర్ట్ అయ్యిపోయారు.