బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామనర్ గా ఆర్మీ లో పని చేసిన కళ్యాణ్ పడాల అడుగుపెట్టి మొదటి మూడు వారాలు డల్ గా ఉండి.. తనూజ సలహాలు బూస్ట్ తో కళ్యాణ్ పడాల ఈరోజు బిగ్ బాస్9 ట్రోఫీకి దగ్గరయ్యాడు. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 కప్ గెలవాలని ఆయన అభిమానులే కాదు బుల్లితెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఆర్మీ మ్యాన్ కప్ గెలిస్తే చరిత్ర సృష్టించినట్టే అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా కళ్యాణ్ పడాల ఆర్మీ కాదు అంటూ ఎస్‌జే సుందర్ అనే ఆర్మీ జవాన్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలు ఇప్పుడు కళ్యాణ్ పడాల పై నెగిటివిటీ పెంచేలా మారాయి. కళ్యాణ్ పడాల అసలు ఇండియన్ ఆర్మీ కాదని, CRPFలో కొద్దికాలమే పనిచేసి వచ్చేశాడని, ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఎవ్వరికైనా పెళ్ళికి కూడా లీవ్ దొరకదు, ఒక వ్యక్తి ఆర్మీ నుంచి 90 రోజుల కంటే ఎక్కువగా బయట ఉండడం నియమాలకు విరుద్ధమని అతను ఆ వీడియోస్ లో కళ్యాణ్ పడాల పై నెగెటివిటి స్ప్రెడ్ చేస్తున్నాడు.
సోల్జర్‌గా ఉంటే ఎక్కడ పడితే అక్కడ సెల్యూట్ చేయరు, ఇండియన్ ఫ్లాగ్ కి చేస్తారు లేదంటే ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తారు కానీ కళ్యాణ్ పడాల హౌస్ లో కెప్టెన్ అయిప్పుడు సెల్యూట్ కొడుతున్నాడు, నాగార్జున ముందు సెల్యూట్ చేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
కానీ కళ్యాణ్ పడాల అభిమానులు మాత్రం ఈ వీడియో లను తిప్పి కొడుతున్నారు. CRPF అయినా, ఆర్మీ అయినా దేశ సేవే చేసాడని, అతనెక్కడా ఇండియాని కానీ, ఇండియన్ ఆర్మీని కానీ కించపరచలేదు, అతను తను వ్యక్తిగతంగా బిగ్ బాస్ లో ఉన్నాడు, అంతేకాని ఎవరిని కించపరిచేలా అతను ఏమి చెయ్యలేదు అంటూ కళ్యాణ్ పడాల అభినుమాలు కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు.