అవును ప్రస్తుతం ప్రభాస్ జపాన్ లో ఉన్నారు. అక్కడ ఉన్న తన అభిమానులను కలిసేందుకు ప్రభాస్ జపాన్ వెళ్లారు. ప్రభాస్ జపాన్ లో ఉండడంతో ద రాజా సాబ్ టీం తో కలిసి ఆయన జియో హాట్ స్టార్ ఈవెంట్ లో పాల్గొనలేకపోతున్నారు. ద రాజాసాబ్ డిజిటల్ హక్కులను భారీ డీల్ తో సొంతం చేసుకున్న జియో ప్లస్ హాట్ స్టార్ చెన్నై లో ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది.
ఆ ఈవెంట్ లో జియో హాట్ స్టార్ రాజాసాబ్ హక్కులను తీసుకున్నట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. చెన్నై లో జరగబోయే ఈ భారీ ఈవెంట్ కి హీరో ప్రభాస్ తప్ప మిగతా అందరూ అంటే ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్, దర్శకుడు మారుతి, హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ లు హాజరవుతారని తెలుస్తుంది.
ప్రభాస్ జపాన్ లో ఉండడంతో ఈ ఈవెంట్ కి హాజరవరని తెలుస్తుంది. సో జనవరి 9 న విడుదల కాబోతున్న ద రాజాసాబ్ సందడి ఈ జియో హాట్ స్టార్ ఈవెంట్ తోనే షురూ అవ్వనుందన్నమాట.