కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతము జననాయగన్ చిత్రాన్ని కంప్లీట్ చేసేసి పూర్తిగా ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టారు. కొన్ని నెలల క్రితం ఆయన కరూర్ లో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఆ ర్యాలీకి విజయ్ ఆలస్యంగా చేరుకోవడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయి మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు.
ఈ తీవ్ర విషాద ఘటన అనంతరం విజయ్ చాలారోజుల తర్వాత మళ్ళీ యాక్టీవ్ అయ్యారు. పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభను ఏర్పాటు చేసారు. అయితే గతంలోలా జరగకుండా పోలీసులు విజయ్ పుదుచ్చేరి సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. అంటే ఈ సభకు పెద్దవారు, పసిపిల్లలు, గర్భిణులు, రాకుండా నిషేధం విధించారు.
అలాగే పార్టీ జారీ చేసిన క్యూఆర్ కోడ్ పాస్ ఉన్న వ్యక్తులకు మాత్రమే వేదిక పైకి అనుమతించనున్నారు. అయితే ఈ సభకు ఒక వ్యక్తి తుపాకీతో రావడం అందరికి ఆందోళన కలిగించింది. తుపాకీతో విజయ్ నిలబడే వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
మరి మొన్న కరూర్ తొక్కిసలాట ఘటన మరవకముందే మరోసారి విజయ్ సభలో ఇలా గన్ కనిపించడం అందరిని అందోళనకు గురి చేసింది.