బిగ్ బాస్ సీజన్ 9 ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో ఇమాన్యుయెల్, కళ్యాణ్ పడాల, తనూజ, భరణి, డిమోన్ పవన్, సంజన, సుమన్ శెట్టి ఉన్నారు. ఏడుగురిలో ఓ ఇద్దరు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఇక ఆ ఏడుగురిలో టాప్ 5 ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే కళ్యాణ్ పడాల టాప్ 5 కి వెళ్ళిపోయాడు. టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇక మిగిలిన ఆరుగురిలో ఏ నలుగురు టాప్ 5 కి వెళ్ళబోతున్నారో వచ్చే వారం రివీల్ అవుతుంది. అందులో ఇమ్మాన్యుయేల్, తనూజ పక్కాగా టాప్ 5 లో ఉంటారు. ఇక డిమోన్ పవన్ కూడా టాప్ 5 ఫిక్స్ అనేది క్లారిటీ వచ్చేసింది. రీతూ చౌదరిని ఎలిమినేట్ చేసి డిమోన్ ని ఉంచడంతోనే టాప్ 5 లో అతను ఉండబోతున్నాడనే హింట్ ఇచ్చారు.
ఇక మిగిలిన సంజన, భరణి, సుమన్ శెట్టి లలో ఎవరు టాప్ 5 కి వెళ్తారో అనేది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. సుమన్ శెట్టి గ్రాఫ్ ఫ్యామిలీ వీక్ తర్వాత పడిపోగా.. భరణి టికెట్ టు ఫినాలే టాస్క్ తర్వాత రేజ్ అయ్యాడు. ఇక సంజన కంటెంట్ ఇస్తుంది అని ఉంచారు తప్ప ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, రీతూ చౌదరి బదులు సంజన ఎలిమినేట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు.
సో టాప్ 5 లోకి సంజనను పంపిస్తారా, లేదంటే భరణిని పంపిస్తారా అనేది వేచి చూడాలి, సుమన్ శెట్టి మాత్రం గత రెండు వారాలుగా ఎలిమినేషన్ తప్పించుకుని ఈసారి పక్కాగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది.