ఒకే సినిమాతో కెరీర్ ఒకేసారి ప్రారంభమైతే? ఆ ఇద్దరు మంచి స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది. ఏ రంగంలోనైనా ఇది సహజంగా కనిపించేది. కొత్తగా వస్తారు...వచ్చిన చోట తెలిసిన వారుండరు. దీంతో అక్కడ ఉన్న వారికంటే? ముందు వాళ్లిద్దరు బెస్ట్ ప్రెండ్స్ గా మారుతుంటారు. కాస్త అటూ ఇటుగా నిఖిల్-వరుణ్ సందేశ్ కెరీర్ కూడా ఇలాగే ప్రారంభమైంది. ఇద్దరు `హ్యాపీడేస్` సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
వరుణ్ కంటే? నిఖిల్ కాస్త సీనియర్ అయినా? వరుణ్ సందేశ్ ఇండస్ట్రీలో ముందుగా నిలదొక్కుకున్నాడు. `హ్యాపీడేస్` తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా చాలా సినిమాలు చేసాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఇంకా మంచి భవిష్యత్ ఉందనుకుంటోన్న సమయంలో వరుణ్ అనివార్య కారణాలతో ఆ ఫేజ్ వరకూ వెళల్లేకపోయాడు. ఈలోగా నిఖిల్ పెద్ద స్టార్ గా మారాడు. వైవిథ్యమైన సినిమాలు చేస్తూ హీరోగా ఇమేజ్ ను సంపాదించాడు.
ఇప్పుడు పాన్ ఇండియాలోనూ గుర్తింపు దక్కించుకున్నాడు. వరుణ్ కొంత బ్రేక్ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. కానీ అవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియదు. అయితే నిఖిల్-వరుణ్ సక్సస్ పుల్ జర్నీలో గానీ... అవకాశాలు రాని సమయంలో గానీ ఇద్దరు మళ్లీ ఎక్కడా కలిసి నట్లు లేదు. అసలు హ్యాపీడేస్ తర్వాత వారిద్దరు ఒకర్ని ఒకరు చూసుకున్నారా? అన్నది కూడా డౌటే. ఎవరికి వారు స్వతంత్రంగానే ఉన్నారు.
నటులుగా ఎవరి ప్రయాణం వారిదన్న తీరులోనే కనిపిస్తున్నారు. ఇద్దరు ఒకేసారి పరిశ్రమలోకి వచ్చినా వారి మధ్య ప్రెండ్ షిప్ అన్నది అంత బలంగా బిల్డ్ అవ్వనట్లే కనిపిస్తోంది. మరి ఎందుకు ఈ వ్యత్యాసం అన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక. వరుణ్ సందేశ్ ఇండియాలో కంటే ఆమెరికాలోనే ఎక్కువగా ఉంటాడు. అమెరికన్ పౌరడుగానూ అతడికి గుర్తింపు ఉంది. మధ్యలో బ్రేక్ వచ్చిన సమయంలో..వివాహం అయిన కొత్తలో కొన్నాళ్ల పాటు అమెరికాలోనే ఉన్నాడు.