దీపికా పదుకొనె డిమాండ్స్ చూసి దర్శకుడు సందీప్ వంగ స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొనెను తప్పించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. దీపికా పదుకొనే ఎనిమిదిగంటల పని విషయంలో ఆమె పై అటు కల్కి మేకర్స్ కూడా ఫైర్ అవుతూ ఆమెని నిర్ధాక్షిణ్యంగా కల్కి పార్ట్ 2 నుంచి తప్పించి వేటువేశారు. అక్కడ కూడా దీపికా డిమాండ్స్ కనిపించాయి.
అయితే తాజాగా కల్కి చిత్రంలో దీపికా పదుకొనె ను తీసేసిన స్థానంలోకి వారణాసి తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక చోప్రాని తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రియాంక చోప్రా కన్ ఫర్మా లేదా అనేది తెలియదు కానీ.. కల్కి 2 లో నటించేందుకు ప్రియాంక చోప్రా భారీ పారితోషికం డిమాండ్ చేసింది అనే వార్త అందరిని ముఖ్యంగా కల్కి మేకర్స్ ని టెన్షన్ పెడుతుంది.
ప్రియాంక చోప్రా పారితోషికమే కాదు మరికొన్ని డిమాండ్స్ కల్కి కోసం చేసింది అంటున్నారు. మరి దీపికా పదుకొనె డిమాండ్స్ చూసి చిరాకేసి ఆమెను అంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి తప్పించి ప్రియాంక కోసం చూస్తుంటే ఈమె దీపికా కన్నా ఎక్కువ డిమాండ్ చెయ్యడం కల్కి మేకర్స్ కి మరింత షాకిచ్చే విషయమే.