అఖండ 2 డిసెంబర్ 5 న రిలీజ్ అయితే అభిమానుల కోలాహలం అఖండ 2 థియేటర్స్ దగ్గర వేరే లెవల్లో ఉండేది. బాలయ్య బ్యానర్ లు కట్టి కటౌట్ కి పాలాభిషేకాలు చేసేందుకు థియేటర్స్ మీ లైటింగ్స్ తో నింపేశారు. క్రాకర్స్ కాల్చాడనికి సిద్దమైన సమయంలో సినిమాని పోస్ట్ పోన్ చేసారు. ప్రొడ్యూసర్స్ ఆర్ధిక లావాదేవీల వలన అఖండ 2 పోస్ట్ పోన్ అవడంపై అభిమానులు చాలా అంటే చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇష్యుస్ సాల్వ్ అయినా.. సినిమా విడుదల తేదీపై మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రొడ్యూసర్ డిసెంబర్ 24 ప్రీమియర్స్ తో డిసెంబర్ 25 సినిమా విడుదల చేస్తే బావుంటుంది అని ఆలోచిస్తుంటే.. బాలయ్య అభిమానులు మాత్రం డిసెంబర్ 11 ప్రీమియర్స్ తో డిసెంబర్ 12 నే సినిమాని విడుదల చెయ్యాలని పట్టుదలతో ఒత్తిడి చేస్తున్నారు.
ఎలాగూ థియేటర్స్ దగ్గర బ్యానర్ లు కట్టినవి, కటౌట్ లు పెట్టినవి అలానే ఉన్నాయి. అవి ఇంకా తియ్యలేదు. డిసెంబర్ 12 న సినిమా విడుదలైతే ఆ సెలబ్రేషన్స్ ని కంటిన్యూ చెయ్యొచ్చనేది వారి ఆలోచన అందుకే వారు డిసెంబర్ 12 నే అఖండ 2 విడుదల కావాలని ఒత్తిడి పెంచుతున్నారు. కానీ అఖండ 2 ప్రొడ్యూసర్స్, బయ్యర్లు డిసెంబర్ 25 నే అంటున్నారు.
ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ మధ్యన చర్చలు నడుస్తున్నాయి. ఏ క్షణమైనా అఖండ తాండవం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడనేది ప్రస్తుతం ఉన్న సస్పెన్స్ .