బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం అన్ ఎక్స్ పెక్టేడ్ గా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి గేమ్ విషయంలో బాగా ఆడినా డిమోన్ పవన్ తో ఆమె చేసిన స్నేహమే టాప్ 5 కి వెళ్లకుండా 13 వ వారంలో ఎలిమినేట్ అయ్యేలా చేసింది. డిమోన్ పవన్ తో రీతూ అతిగా ఫ్రెండ్ షిప్ చేసింది. అటు అతని ఆట, ఇటు రీతూ చౌదరి ఆట రెండూ పోయాయి. లేదంటే టాప్ 5 కంటెస్టెంట్ రీతూ చౌదరి.
ఇక ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చాక బిగ్ బాస్ బజ్ లో హోస్ట్ శివాజీ రీతూ చౌదరిని రోస్ట్ చేసారు. ఆ ఇంటర్వ్యూలో రీతూ చౌదరి ఓటమికి కారణాలు, నువ్వు ఏడ్చినా కన్నీళ్లు రాలేదు, పవన్ తో ఆమె ఫ్రెండ్ షిప్ పై వేసిన ప్రశ్నలకు రీతూ చౌదరి తెల్ల మొహం వేసింది. నా ఆట పవన్ వల్ల పోలేదు, నేను పవన్ కంఫర్ట్ జోన్ లో ఉన్నాము. అతనితో నాది ప్యూర్ ఫ్రెండ్ షిప్..
నేను ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడానికి అవి ఇంకిపోయాయాయి అంటూ పదే పదే అదే పాడింది. అయినా శివాజీ తన హావ భావాలతో రీతూ చౌదరిని ఓ ఆట ఆడుకున్నారు. నువ్వు పవన్ వెనక పడ్డావు, ముందు కళ్యాణ్ తో రెండు వారాలు ట్రై చేసి లాస్ట్ కి డిమోన్ పవన్ ని పడేసావు, మీరిద్దరూ కంటెంట్ కోసమే ఫ్రెండ్ షిప్ చేసారు, కానీ ఆడియన్స్ అంతకు మించి అంటున్నారు అంటూ రీతూ చౌదరిని గుక్కతిప్పుకోని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
నువ్వు బయటికొచ్చావు, మాథ్స్ రాదు, ఇక నీపై అన్ని మీమ్స్ మాథ్స్ పైనే అంటూ శివాజీ రీతూ చౌదరిని ఆడుకున్న ఈ వారం బిగ్ బాస్ బజ్ హైలెట్ అయ్యింది. ఇక బయటికొచ్చాక ఇంటర్వూస్ లోను రీతూ పవన్ తో నాది ప్యూర్ ఫ్రెండ్ షిప్, మాది కంఫర్ట్ జోన్ అంటూ చెప్పుకుంటుంది.