యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈమధ్యన లుక్ మార్చి అభిమానులను భయపెడుతున్నారు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) కోసం ఎన్టీఆర్ 14కేజీల వెయిట్ తగ్గారు సరే.. ఆయన మొహం లో గ్లో పోయింది. ఫేస్ సాగిపోయింది. ఆ గెడ్డం లుక్ లో ఎన్టీఆర్ ని చూసి అందరూ ట్రోల్ చేస్తుంటే అభిమానులు అందోళనపడిపోయారు.
తాజాగా ఎన్టీఆర్ లుక్ ఒకటి బయటికి వచ్చింది. లీన్ లుక్ లో ఎన్టీఆర్ స్టైలిష్ గా గంభీరంగా కనిపించేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. లేదంటే కొద్దిరోజులుగా ఎన్టీఆర్ లుక్ పై వస్తున్న ట్రోల్స్ కి వారు సతమతమయ్యారు. ఎన్టీఆర్-నీల్ కాంబో మూవీ షూట్ ప్రస్తుతం రాత్రిపూట జరుగుతుంది.
ఈ నైట్ షూట్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ లో పోరాడుతున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ తోవినో థామస్ విలన్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.