ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి హరి హర వీరమల్లు, OG చిత్రాలు ఆడియన్స్ ను అలరించగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చాయి. ఒకే ఏడాది రెండు సినిమాలు దించిన పవన్ కళ్యాణ్ ఆరు నెలలు తిరక్కుండానే మరో సినిమాని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది మార్చి లో శివరాత్రి స్పెషల్ గా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
దానికి అనుగుణంగానే షూటింగ్ కంప్లీట్ చేసేసిన హారిష్ శంకర్ ఉస్తాద్ హంగామా స్టార్ట్ చేసారు. మొదటి సింగిల్ కి వేళయరా అంటూ ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా అప్ డేట్ అందిస్తూ పవన్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసారు. ఈనెల 9 న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అంటూ హరీష్ శంకర్ అదిరిపోయే అప్ డేట్ వదిలారు.
పవన్ కళ్యాణ్ సోలో స్టిల్ వదులుతూ ఉస్తాద్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.