అఖండ తాండవం డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయ్యింది. ఎన్నో అంచనాలు, దానికి తగ్గ ప్రమోషన్స్ తో అఖండ డిసెంబర్ 5 కి దిగాల్సి ఉంది. కానీ విడుదలకు జస్ట్ కొన్ని గంటల ముందు సినిమా కోర్టు ఇష్యుస్ తో పోస్ట్ పోన్ అవడంపై అభిమానులు నిర్మాతలపై చిందులుతొక్కారు. ఆతర్వాత ఈరోస్ తో 14 రీల్స్ కి ఉన్న ప్రాబ్లెమ్ క్లియర్ అయ్యింది అన్నారు.
కానీ అఖండ 2 కొత్త డేట్ ఇంతవరకు రాలేదు. మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారు. అఖండ 2 లాంటి సినిమా పోస్ట్ పోన్ అయ్యాక బాలయ్య ఏం చేస్తున్నారు. నిర్మాతలే పడతారు, మనకు అంబంధం లేదు అనుకుని కామ్ అయ్యారా, లేదంటే మరో కొత్త డేట్ కి బాలయ్య ముహుర్తాలు చూస్తున్నారా. అఖండ 2 డిసెంబర్ 12 లేదంటే 25 అంటున్నారు.
కానీ అఖండ 2 మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్సమెంట్ రావడం లేదు, అసలు ఈఏడాది సినిమా ఉంటుందా, ఎందుకయ్యా ఇంత సస్పెన్స్ అంటూ అభిమానులు ఢీలాపడిపోతున్నారు. మరికొందరి వచ్చే ఏడాది సంక్రాంతికి అఖండ 2 రిలీజ్ ఉండొచ్చు, బాలయ్య జనవరి 9 డేట్ పై కన్నేశారనే టాక్ మాత్రం అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుంది. మరి అఖండ 2 మేకర్స్ ఎదో ఒకటి తేలిస్తే కానీ అఖండ సస్పెన్స్ వీడదు.