బిగ్ బాస్ ముద్దుబిడ్డ, నాగార్జున మెచ్చిన కంటెస్టెంట్ తనూజ, అందుకే ఆమెను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మరీ ఆమె తప్పులు చూపిస్తారు తప్ప బయట హౌస్ లో ఆమె తప్పు ఎవ్వరికి తెలియనివ్వరు, తనూజ ఏం చేసినా బిగ్ బాస్ ఏమి అనడు, తనూజ చుట్టూనే కెమెరాలు ఉంటాయి. ఆమె కంటెంట్ కోసమే బిగ్ బాస్ తనూజ ను హైలెట్ చేస్తున్నారనే వారికి ఈ వారం తనూజ ను నాగార్జున తిట్టడడం ఊరటనిచ్చింది.
ఈ వారం నామినేషన్స్ లో ఇమ్మాన్యుయేల్ ని నామినేట్ చేయకుండా అతనితో అర్గ్యూ చెయ్యడం దగ్గరనుంచి రీతూ vs భరణి గేమ్ లో ట్రయాంగిల్ అంటూ దూరడం వరకు తనూజ ను నాగార్జున టార్గెట్ చేసారు. తనూజ ఇన్ని వారాలుగా హౌస్ లో ఉన్నావ్ కాబట్టి నీకు తప్పేదో, ఒప్పేదో తెలియడం లేదు అన్నారు. దానితో తనూజ మొహం మాడ్చుకుంది.
ఇక ఇమ్మాన్యుయేల్ vs సంజన గేమ్ లోను ఇమ్ము తప్పు వీడియో వేసి చూపించారు. భరణి సంచాలక్ డిక్లెర్ చేసాక నువ్వు తనూజ ఎందుకు గేమ్ గురించి మట్లాడారు అంటూ భరణిని వేసుకున్నారు. డిమోన్ పవన్ టికెట్ టు ఫినాలే కొడతానన్నావ్, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది అంటూ పవన్ ని కూడా వీడియో చూపించి మరీ నాగ్ ఏకిపడేసారు, ఇక రీతూ చౌదరికి కూడా క్లాస్ పడింది. ఇమ్మాన్యుయేల్, తనూజ డిస్కషన్ కట్ చెయ్యలేదు అని కెప్టెన్ కళ్యాణ్ ని నాగార్జున టార్గెట్ చేసిన ప్రోమో వైరల్ అవుతుంది.