పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ద రాజాసాబ్ విడుదలకు కౌన్ డౌన్ మొదలయ్యింది. జనవరి 9 న రాజాసాబ్ ఆగమనం. సంక్రాంతి బరిలో ముందుగా కచ్చిఫ్ వేసిన రాజాసాబ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. దర్శకుడు మారుతి హర్రర్ కామెడీగా రాజాసాబ్ ని తెరకెక్కిస్తున్నారు. రాజా సాబ్ ట్రైలర్, సాంగ్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేసింది.
ప్రస్తుతం రాజాసాబ్ సెకండ్ సింగిల్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్. అయితే తాజాగా ద రాజా సాబ్ ఓటీటీ డీల్ ముగిసినట్లుగా తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు రాజా సాబ్ డిజిటల్ హక్కుల కోసం పోటీపడగా.. చివరికి రాజాసాబ్ డిజిటల్ హక్కుల్ని జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది అని తెలుస్తుంది.
ద రాజాసాబ్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. అంతేకాకుండా ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టిందట. సదరు ముంబై కంపెనీకి సంబంధించిన మొత్తాన్ని తిరిగిచ్చే విషయంలో కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అందుకే ఓటీటీ డీల్ పెండింగ్ లో ఉండిపోయింది. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారమై రాజాసాబ్ ఓటీటీ డీల్ పూర్తయినట్లుగా తెలుస్తుంది.
అయితే హాట్ స్టార్ వాళ్ళు రాజాసాబ్ ని 6 వారాలకు గాను స్ట్రీమింగ్ హక్కులు కొన్నారా, లేదంటే 8 వారాలకు గాను స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్నారా అనేది మాత్రం తెలియరాలేదు.