హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతికి వచ్చి 300 కోట్ల క్లబ్బులో కాలు పెట్టిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. మళ్లి వచ్చే ఏడాది అంటే 2026 సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి తో కలిసి అనగనగ ఒక రాజు తో రాబోతుంది. ఆతర్వాత చైతూతో వృషకర్మ లో నటిస్తుంది.
అయితే మీనాక్షి చౌదరి అక్కినేని హీరో సుశాంత్ తో డేటింగ్ లో ఉంది, సుశాంత్ ని మీనాక్షి చౌదరి వివాహం చేసుకోబోతుంది అనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. మొన్నామధ్యన దుబాయ్ లో జరిగిన సైమా వేడుకల కోసం ఇద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దానితో వారి పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి.
ఇప్పుడైతే ఏకంగా మీనాక్షి చౌదరి-సుశాంత్ ల వివాహం అతి త్వరలోనే అనే వార్తలు స్ప్రెడ్ అవడంతో వెంటనే మీనాక్షి చౌదరి టీం ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ సుశాంత్-మీనాక్షి మంచి ఫ్రెండ్స్ మాత్రమే, వారిద్దరూ వివాహం చేసుకోవడం లేదు, అవన్నీ ఫేక్ న్యూస్ లు అంటూ మీనాక్షి టీమ్ క్లారిటీ ఇచ్చింది.