బిగ్ బాస్ సీజన్ 9 లో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఊహించని కంటెస్టెంట్స్ బయటికి వెళతారో, ఎలిమినేట్ అవుతారు అనుకున్న వాళ్ళు ఎలిమినేట్ అవ్వరు.. నిజమే ఇది రణరంగం కాదు చదరంగం అంటూ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నట్టుగా ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగిన విషయం లీకుల ద్వారా వైరల్ అవుతుంది.
గత రెండు వారాలుగా వోటింగ్ లో లీస్ట్ లో ఉంటున్న సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అవ్వలేదు, షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. టికెట్ టు ఫినాలే రేస్ లో టాప్ 2 లో నిలిచిన రీతూ చౌదరిని ఎలిమినేట్ చేసారు. అదే అదే అందరికి షాకింగ్ విషయం. డిమోన్ పవన్ తో క్లోజ్ నెస్ వల్ల ఆమె గేమ్ దారి తప్పింది కానీ లేదంటే రీతూ టాప్ 5 కంటెస్టెంట్.
కానీ సంజన రీతూ చౌదరి చేసే పనులను బయటపెట్టడంతో రీతూ కు సింపతీ పెరుగుతుంది అనుకుంటే ఇక్కడ సంజనకు సపోర్ట్ చేసి ఆడియన్స్ రీతూ ని ఎలిమినేట్ చెయ్యడమే అందరికి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ వారం ఓటింగ్ లో తనూజ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న రీతూ చౌదరి టికెట్ టు ఫినాలే రేస్ లో ఆడి ఓడింది. ఇమ్మాన్యుయేల్, భరణి, కళ్యాణ్ లతో హోరా హోరీగా తలపడింది.
కానీ చివరికి ఓటింగ్ లో వెనకబడింది. ఆమె చేసిన చిన్న చిన్న తప్పిదాలు ఆమెను ఎలిమినేషన్ జోన్ లో నించోబెట్టాయి. టాప్ 5 కి వెళుతుంది అనుకున్న రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యి ఈవారం ఇంటికెళ్లబోతుంది. మరి రీతూ చౌదరి ఎలిమినేషన్ తో పవన్ టాప్ 5 కి దూసుకెళ్తాడేమో చూడాలి.