అఖండ 2 వస్తుంది, మన సినిమాలను ఎవ్వరూ లెక్క చెయ్యరు, బాలయ్య-బోయపాటి కాంబో అంటే ఆ మాత్రం ఉంటుంది, అఖండ 2 థియేటర్స్ ముందు మనమెంత అనుకున్న చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలు ఇప్పుడు ఘొల్లుమంటున్నాయి. అఖండ 2 ని చూసి వెనక్కి తగ్గిన వారు అఖండ తాండవం పోస్ట్ పాన్ అవడంతో అవాక్కయ్యారు.
ఫైనాన్షియల్ ఇష్యు తో అఖండ 2 అనుకోకుండా విడుదలకు కొన్ని గంటల ముందు పోస్టు పోన్ అవడంతో.. ఇప్పుడు చిన్న సినిమాల నిర్మాతలు లబోదిబో మంటున్నారు. అఖండ కోసం ఆగితే ఇలా జరిగేందేమిటి అని, అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యి మళ్లీ ఎప్పుడు బాక్సాఫీసు వద్దకు వస్తుందో అనే మరో టెన్షన్ కూడా ఉంది.
పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కనీసం ఒకటో, రెండో విడుదల కావాలి. ఆడియన్స్ కి ఒక ఛాయిస్ అనేది ఉంటుంది. ఇవాళ ఒక్కటైనా చిన్న సినిమా విడుదల అయ్యుంటే గొప్ప బెనిఫిట్ లభించేది. కానీ చాలామంది నిర్మాతలు అలా చేసేందుకు సాహసించరు. ఈ ఫ్రైడే కొత్త సినిమా చూడకుండానే గడిచిపోతోంది.
అసలు ప్రేక్షకులకు ఈవారం అఖండ తాండవం తప్ప బాక్సాఫీసు వద్ద మరో ఆప్షన్ లేకుండా పోయింది. అఖండ 2 పోస్ట్ పోన్ అయినా ఏదో ఒక సినిమా చూడచ్చు అనుకుంటే.. ఏది లేకుండా ఉస్సురుమానాల్సి వచ్చింది. సో ఈ వారం డల్ గా నిస్సారంగా మూవీ లవర్స్ ని నిరాశలోకి నెట్టి ముగిసిపోయింది.