డిసెంబర్ 6 న బాలయ్య సినిమా అఖండ 2కి పోటీగా కుర్ర హీరో శర్వానంద్ బైకర్ రిలీజ్ అంటూ ఉత్సహంగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. బాలయ్య తో పోటీ అవసరమా అంటే ఆబ్బె పోటీ పోటీనే అంటూ బిల్డప్ ఇచ్చిన శర్వా అండ్ టీమ్ ఇప్పుడు బైకర్ ను పోస్ట్ పోన్ చేసారు. దానితో పాటుగా ప్రమోషన్స్ ను పోస్ట్ పోన్ చేసినట్టుగా ఉన్నారు. అందుకే అంత సైలెంట్ గా కనిపిస్తున్నారు.
మరోపక్క నారి నారి నడుమమురారి ప్రమోషన్స్ పరుగులు పెడుతున్నాయి. ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిపి అందరిని ఆశ్చర్యపరిచారు. మెగాస్టార్, రెబల్ స్టార్స్ మీదకి ఈ నారి నారి నడుమ మురారి అవసరమా అంటే అవసరమే అన్నారు. మరి ఆ చిత్రము సంక్రాంతి బరి నుంచి తప్పించినట్లే అనుకున్న సమయలో ప్రమోషన్స్ వేగవంతం చేసారు మేకర్స్.
త్వరలోనే విడుదల కావల్సిన బైకర్ సైలెంట్ గా ఉంటె ఇదేందయ్యా నెల తర్వాత విడుదలకావాల్సిన నారి నారి నడుమమురారి రేస్ లో దూసుకుపోతుంది.. హీరో శర్వానంద్ అసలే గడ్డు పరిక్షను ఎదుర్కుంటున్నాడు. ఈసమయంలో ఆచి తూచి వ్యవహరించాల్సింది పోయి ఇలా కన్యూజ్ చేస్తే ఎలా అంటూ అభిమానులే మాట్లాడుకోవడం గమనార్హం.