బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ లో ఎలాంటి చేంజ్ లేదు, ఆయన భారీ రూపాన్ని చూసి అభిమానులు డిజప్పాయింట్ అవ్వని రోజు లేదు. అయితే ప్రభాస్ ఎంతమంది జిమ్ ట్రైనర్లు ని పెట్టుకున్నా ఆ వెయిట్ తగ్గడం లేదు, దానితో ఆయన పబ్లిక్ లోకి రావడం తగ్గించేశారు. ఇప్పుడు కూడా ప్రభాస్ స్పిరిట్ కోసం మేకోవర్ అయ్యారు, పోలీస్ లుక్ కోసం చేంజ్ అయ్యారన్నారు.
కానీ అది ఇంతవరకు బయటికి రాలేదు. తాజాగా ప్రభాస్ జపాన్ వెళ్లారు. గతంలో కల్కి కోసం వెళ్లాల్సిన ప్రభాస్ అప్పట్లో వెళ్లలేకపోయారు, దానితో అక్కడి అభిమానులను కలిసేందుకు ప్రభాస్ జపాన్ వెళ్లగా అక్కడ ఆయన లుక్ చూసి అందరూ సర్ ప్రైజ్ షాకవుతున్నారు. అంతలాంటి మేకోవర్ లో ప్రభాస్ ని చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.
గత కొన్నిరోజులుగా ప్రభాస్ స్పిరిట్ లుక్ కోసం మేకోవర్ అవుతున్నారు. ఇప్పుడు ఇంత స్లిమ్ గా ప్రభాస్ కనిపించేసరికి ప్రభాస్ లుక్ క్రెడిట్ మొత్తం దర్శకుడు సందీప్ వంగ కే ఇవ్వాలని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ జపాన్ లుక్ మాత్రం నెట్టింట్లో సంచలనంగా మారింది.