అఖండ 2 హిట్ అవ్వాలంటూ ప్రముఖ కాంట్రవర్సీ జ్యోతిష్కుడు వేణు స్వామి పూజలు చెయ్యడం అందరికి తెలిసిన విషయమే. నందమూరి బాలకృష్ణ-బోయపాటి కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన అఖండ తాండవం చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలంటూ వేణు స్వామి ప్రత్యేక పూజలు చేసారు.
ఆయన ఇలానే చాలామంది హీరోయిన్స్ కి స్పెషల్ పూజలు చెయ్యగా అందులో కొంతమంది హీరోయిన్స్ సక్సెస్ సాధించారు. కొన్నిమాత్రం జరగలేదు. నాగార్జున ఫ్యామిలీ, నాగ చైతన్య-సమంత విడాకుల విషయంలోనూ, టీవీ 5 మూర్తి విషయంలోనూ వేణు స్వామి చేసిన కామెంట్స్ అప్పట్లో దుమారాన్ని రేపడమే కాదు ఆయన్ని కోర్టు మెట్లు కూడా ఎక్కించాయి.
తాజాగా వేణు స్వామి అఖండ2 హిట్ అవ్వాలని పూజలు చేసిన తర్వాత అఖండ 2 అనుకోని పరిస్థితిల్లో విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా పడడంతో ఇదంతా వేణు స్వామి అఖండ 2 కి పూజలు చెయ్యడం వలనే జరిగింది. అసలు వేణు స్వామిని ఎవరు పూజలు చెయ్యమన్నారు అంటూ వేణు స్వామిపై నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు.