ఏదైనా పర్ఫెక్షన్ కోరుకునే బాలయ్య.. అఖండ 2 విషయంలో ఇంత గందరగోళం జరుగుతుంటే ఏం చేస్తున్నారబ్బా అంటూ యాంటీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆయనకి ఏదైనా సక్రమంగా జరక్కపోతే ఎక్కడలేని కోపము వస్తుంది. ఎదుటి వారు ఎంతటి వారైనా తన కోపాన్ని చూపించేసే బాలయ్య అఖండ తాండవం రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంటే ఇలా కామ్ గా ఉన్నారేమిటో అంటున్నారు.
అఖండ 2 నిర్మాతలు బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కి బాకీ పడి అది కట్టకుండా సినిమాని రిలీజ్ చేస్తామంటే.. వారు సినిమా విడుదల కాకుండా స్టే తెచ్చారు. ఎన్నో అంచనాలు, ఎంతో క్రేజ్ ఉన్న అఖండ 2 ఆపారు. మరి ఇదంతా బాలయ్య కు ముందు తెలియదా.. సినిమా విడుదల ముందు రోజు సినిమా వాయిదా వేస్తె ఎంత తలఒంపులు.
చిన్న కుమర్తె తేజిస్విని అన్ని హ్యాండిల్ చేస్తుంది. ఈ విషయంలో ఆమె అనుభవం సరిపోలేదా, అసలు బాలయ్య ఎందుకింత సైలెంట్ గా ఉన్నారు, అఖండ ప్రమోషన్స్ లో కుర్రాడిలా మారిపోయి ఎనేర్జిటిక్ గా కనిపించిన బాలయ్య సినిమా విడుదల సమయానికి సైలెంట్ అవడం అభిమానులను కలవరపరుస్తోంది.
మరి బాలయ్య ముందుకొచ్చి సమస్య పరిష్కరించాలి కానీ, ఇలా అయితే ఎలా, నిర్మాతలను ఈరోస్ సంస్థను కూర్చోబెట్టి సెటిల్ చెయ్యాల్సిన వ్యవహారం కోర్టులకెక్కడం, ఆ ఎఫెక్ట్ సినిమా విడుదలపై పడడం ఇవన్నీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరి అఖండ 2 విడుదల ఎప్పుడు అనేది ఇప్పుడు వారు అడుగుతున్న ప్రశ్న.