తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు, విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు తేదీలను పాలకమండలి ప్రకటించింది.
శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు 10రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు
వైకుంఠద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే అధిక ప్రాధాన్యత కల్పిస్తూ టీటీడీ చర్యలు
మొదటి 3రోజులకు గానూ ఇప్పటికే ఆన్‌లైన్ ఈ-డిప్ ద్వారా 1.89 లక్షల సర్వదర్శనం టోకన్లు జారీ చేసిన టీటీడీ
చివరి 7 రోజులకు గానూ రోజుకు 15వేలు రూ 300 టిక్కెట్లు....రేపు మ3 గంటలకు, రోజుకు 1 వెయ్యి శ్రీవాణి టిక్కెట్లు రేపు ఉ 10గంటలకు ఆన్ లైన్ విడుదల చేయనున్న టీటీడీ
చివరి 7 రోజులు సర్వదర్శనం యథాతథంగా కొనసాగింపు
ఎలాంటి టిక్కెట్లు, టోకన్లు లేని భక్తులకు కూడా ఈదఫా వైకుంఠద్వార దర్శనభాగ్యం కల్పించనున్న టీటీడీ
దాతలకు సంభందించి...పరిమిత సంఖ్యలో టికెట్లు కోటాను రేపు సా 5 గంటలకు ఆన్‌లైన్ లో విడుదల
10 రోజుల పాటు అన్ని ప్రత్యేక, వెసులబాటు దర్శనాలు...ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
7 నుండి 7.5 లక్షల మంది భక్తులకుపైగా వైకుంఠద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ సన్నద్ధం
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు తేదీలను ప్రకటించిన టీటీడీ
నేటి నుండి 2026 జనవరి నెలాఖరు వరకు వచ్చే పలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ
డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ, డిసెంబర్ 30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ప్రకటించిన రోజుల్లో విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం రద్దు
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.