అనసూయ అందానికి కేరాఫ్ అడ్రస్. అసలు యాంకర్స్ ఇప్పుడు ఇంతిలా గ్లామర్ షో చేస్తున్నారు అంటే దానికి కారణం అనసూయే. యాంకరింగ్ కి గ్లామర్ టచ్ ఇచ్చిన మొదటి యాంకర్ అనసూయ. అనసూయ జబర్దస్త్ షో లో అందానికి సరిపోయే గ్లామర్ షో, అందుకు తగ్గ మాటకారితనంతో యాంకరింగ్ అనే పదానికి కొత్త అర్ధం చెప్పింది.
ఇప్పుడు బుల్లితెర కు బ్రేకిచ్చి సినిమాలు మాత్రమే చేస్తున్న అనసూయ సమయం ఉన్నప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గానే కెన్యా కి వెళ్లి అక్కడ ఫారెస్ట్ లో భర్త భరద్వాజ్, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసి వచ్చింది. వచ్చాక రిబ్బన్ కటింగ్స్ తో బిజీ అయ్యింది.
తాజాగా అనసూయ చీరకట్టులో ఉన్న ఫొటోస్ పోస్ట్ చేసింది. ఆ చీరకట్టులో నిజంగా ఆమె కనికట్టు చేసింది. శారీ లో ఆమె చూపించిన రాజసం పై యూత్ కూడా మాట్లాడుకోవడం గమనార్హం. బరువుపెరిగినా హైట్ తో కవర్ చేస్తున్న అనసూయ చీర లో నిజంగా అద్భుతంగా కనిపించింది.