ఏ స్టార్ హీరో అయినా తమ సినిమా రిలీజ్ అవుతుందంటే? అభిమానులకు ఏ రేంజ్ లో ఎక్కిస్తారో చెప్పాల్సిన పని లేదు. అభిమానులు కోసమే ఈ సినిమా ప్రత్యేకంగా చేసామాంటూ..తమ కోసమే ఇంకా సినిమాలు చేస్తున్నామని.. భవిష్యత్ లో ఇంకా పనిచేస్తూనే ఉంటామని చెబుతుంటారు. ఏనాడు మా సినిమా చూడొద్దు..డబ్బు అనవసరంగా వృద్దా చేసుకోవద్దు..అభిమానం పేరుతో త్యాగాలకు పాల్పడొద్దు అనే చెప్పే స్లార్లు ఇంతవరకూ ఎక్కడా చూసి ఉండరు.
అలాంటి స్టార్లు ఓ ఇద్దరు కనిపిస్తున్నారు. వారే తల అజిత్..శివ కార్తికేయన్. ఇద్దరు తమిళనాడు పరిశ్రమకు చెందిన హీరోలు. ముందుగా అజిత్ విషయానికి వస్తే? అజిత్ అభిమానులు ఏమని చెబుతాడో తెలుసా? తనని అతిగి అభిమా నించొద్దని...అనవసరంగా సినిమాలు చూసి సమయం వృద్దా చేయోద్దని...జేబు నిండా డబ్బు..ఖాళీ సమయం ఉంటే తప్ప తన సినిమాలు చూడొద్దంటాడు. యువతను తమ కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టమని చెబుతాడు. థియేటర్ ముందు కటౌట్లు కట్టడం...నాగా హంగామా చేయడం వంటివి తనకెంత మాత్రం నచ్చదని...తనని ఓ స్నేహితుడిలా మాత్రమే భావించామంటాడు.
ఇదే బాటలో శివ కార్తికేయన్ కూడా స్వరమందుకున్నాడు. అసలైన రియల్ హీరోలు తాము కాదని..దేశం కోసం పోరాడే సైనికులు...అన్నం పెట్టే రైతులు మాత్రమే రియల్ హీరోలన్నాడు. వాళ్లను మాత్రమే యువత అభిమనించాలి తప్ప తన లాంటి నటుల్ని కాదని హితవు పలికాడు. హీరో కంటే ముందు ఇంట్లో ఉండే తల్లిదం డ్రులను ..అక్కచె ల్లిని..అన్నదమ్ములను తలుచుకోవాలని అలాంటి వారంటేనే తనకిష్టమన్నాడు.
అభిమానం అనేది హద్దుల్లో ఉండాలని.. ఆ పేరుతో డబ్బులు దుబారా ఖర్చు చేయోద్దని సూచించాడు. ఇలాంటి మాటలు నేటి యువతకు ఎంతైనా అవసరం. అవేర్ నెస్ లేకపోవడంతోనే అభిమానం హద్దు మీరుతుంది. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకూ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో అభిమానం పేరుతో ప్రాణాలు పొగొట్టుకున్న వారెంతో మంది ఉన్నారు. అభిమానలుకు అవేర్ నెస్ కల్పించడంలో తెలుగు హీరోలు కూడా మారాలి.