నందమూరి అభిమానులకు బిగ్ షాకిచ్చారు అఖండ మేకర్స్. మరికొద్ది గంటల్లో మొదలు కాబోయే అఖండ తాండవం ప్రీమియర్స్ షోస్ క్యాన్సిల్ అంటూ నిర్మాతలు స్టేట్మెంట్ ఇవ్వడం అభిమానులను బిగ్ డిజప్పాయింట్ చేసింది. అభిమానులనే కాదు ఏపీలో ప్రీమియర్స్ అంటూ ప్రకటించి టికెట్లు అమ్మేసుకున్నాక ప్రీమియర్స్ షోస్ క్యాన్సిల్ అవడంపై ఇప్పుడు బయ్యర్లు కు దిగులు పట్టుకుంది.
14 రీల్స్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఇంకా కొలిక్కి రాని కారణంగా అనుకున్న సమయానికి అఖండ ప్రీమియర్స్ షోలు వేయలేకపోతున్నారని, ప్రొడక్షన్ హౌస్ నుంచి రద్దు గురించి మాత్రమే నోట్ వచ్చింది కానీ దానికి సంబందించిన మరె ఇతర వివరాలు తెలియదు. ఏపీ లో అమ్మేసుకున్న ప్రీమియర్స్ టికెట్ డబ్బులు కూడా రి ఫండ్ చేస్తున్నారు థియేటర్ యాజమాన్యాలు.
మరి క్రేజీ హీరో, సక్సెస్ ఫుల్ హీరో బాలకృష్ణ నటించిన సినిమాకు ఇలాంటి సమస్యమేమిటి అంటూ అభిమానులు ఆగ్రహిస్తున్నారు. అఖండ కాంబో అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుంది. అదే అరిపించే అంచనాల మధ్య విడుదల కావాల్సిన అఖండ 2 కి ఇలాంటి చికాకులు రావడమే అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది.