అవును సమంత లైఫ్ లో ఇప్పటికి మూడు అధ్యయాలు జరిగాయి. సమంత హీరోయిన్ గా ఎదిగేందుకు చాలానే కష్టపడింది. ఆతర్వాత ఆమె లైఫ్ లోకి హీరో సిద్దార్థ్ ప్రవేశించాడు. అతనితో డేటింగ్ అంటూ శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజలు చేసి మరీ పెళ్ళికి చేసుకుందామనుకున్న తరుణంలో సిద్దార్థ్ తో సమంత బ్రేకప్ అయ్యింది.
ఆ తర్వాత నాగ చైతన్య తో డేటింగ్ ని సీక్రెట్ గా మైంటైన్ చేసి మరీ పెళ్లాడింది. అంగరంగ వైభవంగా గోవాలో నాగ చైతన్య-సమంత ల వివాహం జరిగింది. ఆ పెళ్లి నాలుగేళ్లకే పెటాకులయ్యింది. నాగ చైతన్య-సమంత విడిపోయారు. ఆతర్వాత ఆమె కొన్నాళ్ళు ఒంటరిగానే అనారోగ్యంతో పోరాడింది. సౌత్ సినిమాలు తగ్గించి హిందీ వైపు వెళ్లి అక్కడ వెబ్ సీరీస్ లు చేసుకుంటూ హిందీ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ స్టార్ట్ చేసింది.
రాజ్ నిడిమోరు తో కామ్ గా డేటింగ్ చేస్తూ తమ ఎఫైర్ ని సీక్రెట్ గా ఉంచి.. ఫైనల్ గా ఈ నెల 1 న రాజ్ ని వివాహమాడింది. రాజ్ నిడిమోరు తో సమంత తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసింది. వ్యక్తిగతంగా సమంతకి ఇది మూడో అధ్యాయమే. మొదట సిద్దార్ట్ తో ప్రేమ బ్రేకమ్, తర్వాత నాగ చైతన్య తో పెళ్లి బ్రేకప్, ఇప్పుడు రాజ్ నిడిమోరు తో రెండో వివాహం. ఇలా సమంత వ్యక్తిగత జీవితం చూస్తే ఈ మూడు అధ్యయాలు కీలకమే.