నేషనల్ క్రష్ రష్మిక మందన్న థామా అలాగే గర్ల్ ఫ్రెండ్ విజయాలతో చాలా హ్యాపీ గా ఉండడమే కాదు ఈ ఏడాది తనకు చాలా ప్రత్యేకమైంది అని చెబుతుంది. ఆమె అనడం కాదు కానీ.. ఈ ఏడాది రష్మిక మందన్న నామ సంవత్సరంగా 2025 మిగిలిపోవడం ఖాయం. ప్రస్తుతం 2025 ముగింపుకి రష్మిక వెయిట్ చేస్తుంది.
కారణం ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ తో మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు నడవబోతుంది. ఆ విషయంలో రష్మిక ఓపెన్ అవ్వకపోయినా పెళ్లి వార్తలను ఒప్పుకోనూలేను, అలాగే ఖండించను లేను, ప్రవేట్ విషయాలు పబ్లిక్ లో మాట్లాడడం ఇష్టముండదు అంటూ రశ్మిక కవర్ చేసింది.
కవర్ అంటే గుర్తొచ్చింది.. రష్మిక తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ పై హొయలు పోయింది. మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రష్మిక సూట్ వేసుకుని కనిపించింది. అంతేకాదు మత్తెక్కించే చూపులతో రష్మిక మందన్న ఈ మ్యాగజైన్ షూట్ లో అద్దరగొట్టేసింది. మీరు కూడా రష్మిక లేటెస్ట్ ఫొటోస్ పై ఓ కన్నెయ్యండి. .